Traveling

Posted by Admin | 25 Jul 2024

భారతీయులు విదేశీయానాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.
2019తో పోలిస్తే జపాన్లో 53 శాతం, అమెరికాలో 59 శాతం, వియత్నాంలో 248 శాతం భారతీయ ప్రయాణికులు రాకపోకలు పెరగడం విశేషం.
మాస్టర్ కార్డ్ ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్ 'బ్రేకింగ్ బౌండరీస్' పేరుతో తాజా ట్రావెల్ ట్రెండ్సు విడుదల చేసింది.
గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది.
ఆదాయాన్ని మెరుగు పరచుకోవడంతో విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు సంఖ్య ట్రావెల్, టూరిజం రంగానికి ఊతమిస్తోందని నివేదిక పేర్కొంది.
వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల మందికి పైగా మధ్య తరగతి ప్రజలు (ఏడాదికి రూ.12 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారు).
దాదాపు 20 లక్షల మంది అధిక ఆదాయ ప్రజలు (ఏటా రూ.66 లక్షలు కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు)
కూడా అంతర్జాతీయ ప్రయాణికుల జాబితాలో చేరతారని అంచనా వేసింది.
విస్తరిస్తున్న విలాసవంతమైన ఆలోచనలు ఔట్ బౌండ్ ఇండియా ట్రావెల్ రంగాన్ని అసాధారణ వృద్ధిలోకి తీసుకెళ్తున్నాయని అభిప్రాయపడింది.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే సుమారు 10 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఒకదశాబ్దం కిందటి వరకు ఈ సంఖ్యలో ప్రయాణాలు చేయాలంటే ఏడాది సమయం పట్టేది.
అంటే భారతీయుల్లో ఏ స్థాయిలో ప్రయాణాలు వృద్ధి చెందాయో నివేదిక స్పష్టం చేస్తోంది.
ఈ ఏడాది మార్చి నాటికి దేశీయ ప్రయాణాలు 21 శాతం, విదేశీ ప్రయాణాలు 4 శాతం మేర పెరిగినట్టు గుర్తించింది.
ఆమ్స్టర్గామ్, సింగపూర్, లండన్, ఫ్రాంక్ఫర్డ్, మెల్బోర్న్ు ఈ వేసవి (జూన్-ఆగస్టు)లో భారతీయ ప్రయాణికులు సందర్శించే ఐదు ట్రెండింగ్ గమ్యస్థానాలుగా నిలవడం విశేషం.
2019, 2020లో ఒక పర్యటన సగటు వ్యవధి నాలుగు రోజులుగా ఉంటే ఈ ఏడాది ఐదు రోజులకు పెరిగింది.
పెరిగిన క్రూయిజ్ ప్రయాణాలు
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యూరోపియన్ చాంపియన్i?ప్ కారణంగా 2024లో జర్మనీలోని మ్యూనిచ్ టాప్ ట్రెండింగ్ డెస్టినేషన్గా నిలిచింది.
గత మార్చికి ముందు 12 నెలల్లో ప్రజలు అత్యధికంగా ప్రయాణించిన గమ్యస్థానంగా జపాన్ నిలిచింది.
ముఖ్యంగా ఐదు మార్కెట్లలో నాలుగు యూరోపియన్ గమ్యస్థానాలు, టాప్ 10లో 50 శాతం ఆసియా-పసిఫిక్ గమ్యస్థానాలు ఉన్నాయి.
పెరిగిన క్రూయిజ్ ప్రయాణాలు
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యూరోపియన్ చాంపియన్?ప్ కారణంగా 2024లో జర్మనీలోని మ్యూనిచ్ టాప్ ట్రెండింగ్ డెస్టినేషన్గా నిలిచింది.
గత మార్చికి ముందు 12 నెలల్లో ప్రజలు అత్యధికంగా ప్రయాణించిన గమ్యస్థానంగా జపాన్ నిలిచింది.
ముఖ్యంగా ఐదు మార్కెట్లలో నాలుగు యూరోపియన్ గమ్యస్థానాలు, టాప్ 10లో 50 శాతం ఆసియా-పసిఫిక్ గమ్యస్థానాలు ఉన్నాయి.
గడిచిన ఏడాది అత్యధికంగా ప్రయాణికులను ఆకర్షించిన గమ్యస్థానాల్లో జపాన్, ఐర్లాండ్, రొమేనియా, ఇటలీ, స్పెయిన్, మలేషియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, యూఏఈ, ఇండోనేషియా నిలిచాయి.
అయితే విదేశీ సందర్శకుల రికవరీలో అమెరికా 2019తో పోలిస్తే 6 శాతం తక్కువగా ఉండటం గమనార్హం.
హెూటల్ పరిశ్రమలలో నిరంతరం ధరల పెరుగుదల కారణంగా క్రూయిజ్ ప్రయాణాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్ క్రూయిజ్ ప్యాసింజర్ లావాదేవీల సంఖ్య 2019 కంటే దాదాపు 16 శాతం పెరిగాయి.

Latest Blogs

విదేశాలకే 'విహారం'

Posted by Admin | 25 Jul 2024

భారతీయులు విదేశీయానాల్లో సరికొ&#
Read More..

Vihari Book

Posted by Admin | 24 Jul 2024

Like every great book of yore, let us begin by stating concisely what the book will be about. As said, this book will be a brief stroll through our great nation-Bhaarata. Our stroll will take us throu
Read More..

Beauty and Charm of Zurich

Posted by Admin | 29 Jun 2023

Zurich, a city nestled in the heart of Switzerland, is a true gem that beckons travelers from around the world. With its rich cultural heritage, stunning landscapes, and vibrant city life, Zurich offe
Read More..

Majestic Beauty of Barcelona's Sagrada Familia

Posted by Admin | 10 Jun 2023

Barcelona's Sagrada Familia is a true masterpiece that captivates visitors from all corners of the globe. Designed by the visionary architect Antoni Gaud?, this awe-inspiring basilica is a testament t
Read More..

Unbelievable Polar Bear Exhibition

Posted by Admin | 8 Jun 2023

Even though it's renowned for hosting the largest aquarium in the world, the Chimelong Marine park has pretty good surprises up it's sleeves. One of them is the Polar Horizon which exhibits the Arctic
Read More..